రెండో ఎస్సార్సీ కోసమే ప్రధాని మన్మోహన్ కోర్ కమిటీ సమీక్ష జరిపారా?

తెలంగాణతో పాటు పశ్సిమ బెంగాల్లో కూడా ఎప్పటినుండో ఉన్న గూర్ఖాలాండ్ విషయాన్ని కూడా వారు చర్చించారు. దేశంలో పలు రాష్ట్రాలలో చిన్న రాష్ట్రాల డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీ సాధ్యాసాధ్యాలపై చర్చించినట్టు తెలుస్తోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక అనంతరం రెండో ఎస్సార్సీ వేసే విషయాన్ని ప్రధాని ముఖ్యంగా వారితో చర్చించినట్లు కూడా తెలుస్తోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక కేంద్రానికి ఇవ్వడానికి డిసెంబర్ 31వ తేది వరకు గడువు ఉన్న దృష్ట్యా ఈ రెండు రోజుల్లో ఎప్పుడు ఇవ్వాలనేది వారి చర్చలోని మరో ముఖ్యాంశంగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications