వెన్నుపోటుదారుడు: జగన్ పై ఎంపీ మధుయాష్కీ పరోక్ష విమర్శ

Madhu Yashki
హైదరాబాద్: సీమాంధ్రకు చెందిన ప్రజా ప్రతినిధులు కాంగ్రెసు పార్టీలో ఉండి కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఆ తర్వాత పార్టీకే వెన్నుపోటు పొడుస్తున్నారని పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ అన్నారు. పార్టీని కాపాడుకుంటూ తెలంగాణను సాధించుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యులు దీక్ష చేయటం వల్ల కాంగ్రెసు పార్టీని ప్రయోజనమే కానీ ఎలాంటి నష్టం జరగదన్నారు. కేంద్ర బలగాలను ఉపసంహరించే వరకు కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని చెప్పారు.

రాష్ట్రంలో కేంద్ర బలగాల మోహరింపులో గవర్నర్ నరసింహన్, డిజిపి ఆనందరావులు కీలక పాత్ర వహించారని ఆరోపించారు. కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు అనుకూలంగా వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా వస్తే పార్టీలకతీతంగా తెలంగాణకు చెందిన అన్ని పార్టీల నాయకులం ఉద్యమిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+