రేపే శ్రీకృష్ణ కమిటీ నివేదిక: కిరణ్ కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష

శ్రీకృష్ణ కమిటీ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి అందనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించారు. ఈ సమావేశంలో హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, డిజిపి అరవింద రావు, ఇంటెలిజెన్స్ ఐజి మహేందర్ రెడ్డి, హైదరాబాదు పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ పాల్గొన్నారు. భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే విషయంపై ఈ సమావేశంలో చర్చించారు.
భద్రతా ఏర్పాట్లపై బుధవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ కార్యదర్శి పిళ్లై రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో మాట్లాడారు. తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సూచనలు చేస్తోంది.












Click it and Unblock the Notifications