నేడు సాయంత్రమే నివేదిక!: త్వరగా పూర్తి చేయాలని కేంద్రం యోచన

BN Srikrishna
న్యూఢిల్లీ: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను బుధవారం సాయంత్రమే కేంద్రానికి సమర్పించనున్నట్టు తెలుస్తోంది. ఆ కారణంగానే ప్రధానమంత్రి మన్మహన్ సింగ్ కోర్ కమిటీతో చర్చించినట్లు తెలుస్తోంది. శుక్రవారం వరకు నివేదిక ఇవ్వడానికి సమయం ఉన్నప్పటికీ బుధవారం సాయంత్రగానీ, గురువారం ఉదయం గానీ నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమస్యలను ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా పరిష్కరించాలని కేంద్రం యోచిస్తుంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పొగ మరిన్ని రాష్ట్రాలకు అంటకముందే దీనిపై తొందరగా నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గూర్ఖాలాండ్ రాష్ట్రం గురించి పశ్చిమ బంగాల్లో గొడవ జరుగుతోంది. చిన్న రాష్ట్రాల వివాదం మరిన్ని రాష్ట్రాలకు తాకకుండా ఉండేందుకు త్వరితగతిన పూర్తి చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఇచ్చిన రోజునే ప్రధాని కార్యాలయానికి పంపే అవకాశం ఉంది

ప్రధానమంత్రి కార్యాలయం కూడా తమ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి మంత్రులకు కమిటీకి అప్పగిస్తుంది. ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలని ప్రధానమంత్రి మంత్రుల కమిటీకి సూచించే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి కమిటీ తన నివేదికను ఇచ్చిన వారం రోజులలోపే ఈ ప్రక్రియను పూర్తి చేసే దిశలో ఆలోచిస్తుంది. జనవరి 3, 4 తేదీల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటుందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+