ఎన్ని దీక్షలు చేసినా రైతులు చంద్రబాబును నమ్మరు: చిరంజీవి

Chiranjeevi
ఒంగోలు: చంద్రబాబు నాయుడు రైతుల కోసమంటూ ఎన్ని దీక్షలు చేసినా మరెన్ని సభలు పెట్టినా తెలుగుదేశం పార్టీ తొమ్మిది ఏళ్ల పాలనను రైతులు మరిచిపోరని ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి గురువారం ప్రకాశం జిల్లా పర్యటనలో అన్నారు. పంట నష్టపోయి మరణించిన రైతుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతు వ్యతిరేక ముద్ర పోగొట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీ బాగా తాపత్రయ పడుతుందన్నారు.

సభలు ఏర్పాటు చేయడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేసే బదులు ఆ సభలకు అయ్యే ఖర్చును రైతులకు ఇస్తే వారికి కొంత ఉపశమనంగా ఉంటుందన్నారు. సభలకోసం ఖర్చు చేసే బదులు రైతులకివ్వాలని సూచించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవసాయం లాభసాటి కాదన్న వ్యాఖ్యలు బాగా బాధించాయని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని అంశాలను రెండు రోజుల్లో బహిర్గత పరిచి ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని చిరంజీవి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

తమను ఆదుకుంటుందని ఆశలు పెట్టుకున్న వారికి ప్రభుత్వం నిరాశ మిగిల్చిందని అన్నారు. ప్రభుత్వం సాయమందించడంలో విఫలం కావడంతో రైతులు ఆత్మహత్యలే శరణ్యం అనే దశకు చేరుకున్నారన్నారు. విద్యార్థుల కేసులు ఎత్తివేత విషయంలో తెలంగాణ పార్లమెంటు సభ్యులు ప్రభుత్వంపై చేసిన ఒత్తిడిని అభినందిస్తున్నట్టు చెప్పారు. అయితే అలాంటి ఒత్తిడే రైతులను ఆదుకోవడంలో కూడా ప్రభుత్వంపై తీసుకు రావాలన్నారు. రైతులపై వారికి ఉన్న చిత్తశుద్ది నిరూపించుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+