మే 8న ఎంసెట్ పరీక్షలు: మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటన
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: వచ్చే సంవత్సరం మే 8న ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నట్టు మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. వాటి ఫలితాలను పదిహేను రోజులలో విడుదల చేస్తామని చెప్పారు. మే 15వ తేదీన ఐసెట్ పరీక్షలు, జూన్ 4న ఎడ్సెట్ పరీక్షలు నిర్వహించున్నట్టు ప్రకటించారు. పరీక్షా కేంద్రాల్లో హైటెక్ కాపీయింగుకు పలువురు పాల్పడుతున్నట్టు దృష్టికి వచ్చినట్టు చెప్పారు. హైటెక్ కాపీయింగును అడ్డుకోవడానికి పరీక్షా కేంద్రాల్లో జామర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎంసెట్లో ఇంటర్లో 25 మార్కుల వెయిటేజీ ఈ సంవత్సరమూ కొనసాగుతుందని చెప్పారు.