శ్రీకృష్ణ కమిటీపై నోరు విప్పొద్దు: పార్టీ ఎంపీలకు మొయిలీ హెచ్చరిక

Veerappa Moily
న్యూఢిల్లీ‌: శ్రీకృష్ణ కమిటీ నివేదికపై నోరు విప్పవద్దని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ రాష్ట్ర పార్లమెంటు సభ్యులను ఆదేశించారు. ఆయన తెలంగాణ, సీమాంధ్ర పార్లమెంటు సభ్యులకు గురువారం ఉదయం ఫోన్లు చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఏమీ మాట్లాడవద్దని, ఈ విషయంపై మీడియాకు దూరంగా ఉండాలని, ఇదే అధిష్టానం ఆదేశమని ఆయన పార్టీ పార్లమెంటు సభ్యులతో చెప్పారు. పార్లమెంటు సభ్యులు ఏం మాట్లాడినా ప్రజలను రెచ్చగొట్టినట్లవుతుందని ఆయన అన్నారు.

ఏమైనా చెప్పాలనుకుంటే కేంద్ర ప్రభుత్వంతో గానీ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో గానీ చెప్పాలని, బహిరంగంగా అభిప్రాయాలను వెల్లడించకూడదని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు విమర్సలు చేసినా, ఆందోళనకారులు విరుచుకుపడినా సంయమనం పాటించాలని ఆయన సూచించారు. విమర్శలకు తగిన సమయంలో తగు విధంగా సమాధానం చెప్పడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన సూచించారు. పార్టీ నాయకులతో పాటు ఎవరూ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై మాట్లాడకూడదని ఆయన హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+