జనవరి 6న శ్రీకృష్ణ కమిటీ నివేదికను వెల్లడిస్తాం: చిదంబరం

కమిటీకి సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు, గ్రూపులు, పార్టీలు కమిటీకి సహకరించాయని తెలిపారు. నివేదికను హోం మంత్రిత్వ శాఖ అధ్యయనం చేసిన తర్వాత చర్యలు ఉంటాయని చెప్పారు. ఈ ఏడాది జనవరి 5వ తేదీన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరిస్తామని రాజకీయ పార్టీలు హామీ ఇచ్చాయని, దానికి కట్టుబడి ఉన్నాయని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై సంప్రదింపులు జరుగుతాయని, సంప్రదింపుల తర్వాత తీసుకునే నిర్ణయాలకు రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండాలని, ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇదే అతి ముఖ్యమైన అంశమని ఆయన అన్నారు. జనవరి 6వ తేదీ సాయంత్రం నివేదికను తాము ఇంటర్నెట్ లో ఉంచుతామని శ్రీకృష్ణ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఊహాజనితాల కథనాలు రాయవద్దని, కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని చిదంబరం మీడియాను కోరారు.












Click it and Unblock the Notifications