కిరణ్ కుమార్ రెడ్డితో చిరంజీవి భేటీ ఆంతర్యం ఏమిటి?

పంట నష్టానికి రైతులకు ఇస్తున్న పరిహారాన్ని రూ.పది వేలకు పెంచాలని కోరినట్లు తెలిసింది. కేంద్రం నుంచి ఆర్థిక సాయం వచ్చిన తర్వాత మరికొంత సాయం అందించేందుకు కృషి చేస్తామని సీఎం అన్నట్లు సమాచారం. శ్రీకృష్ణ కమిటీ నివేదిక, ఢిల్లీలో కేంద్ర హోంశాఖ నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి కొన్ని పార్టీలు దూరంగా ఉండటం, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపైనే ప్రధానంగా వీరు చర్చించుకున్నట్లు తెలిసింది. రైతు సమస్యలపైనే ముఖ్యమంత్రిని కలిసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నా ఇది ప్రధాన అంశం కాదని తెలుస్తోంది. ఎంఐఎం నేతలతో ఏం చర్చించారన్నది తెలియరాలేదు.












Click it and Unblock the Notifications