ఓదార్పు యాత్ర కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరిన జగన్

కాంగ్రెస్ పార్టీని వీడాక జగన్ చేపడుతున్న తొలి ఓదార్పు యాత్ర కాబట్టి అందరిలోనూ ఆతృత నెలకొన్నది. ఎమ్మెల్యే కన్నబాబు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి జగన్ ఓదార్పుకు మద్దతు ప్రకటిస్తామని ఇంతకుముందే స్పష్టం చేశారు. ఇక 10 రోజుల పాటు జరిగే ఈ ఓదార్పు యాత్రలో 795 కిలోమీటర్లు వైయస్ జగన్ తిరుగుతారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో మరణించిన 18 మంది కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. జిల్లాలో 103 వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆయన ఆవిష్కరించనున్నారు.












Click it and Unblock the Notifications