వైయస్ జగన్‌ను టార్గెట్ చేసిన లోకేష్ చానెల్: చంద్రబాబు ఉత్సాహం

Nara Lokesh
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఆదివారం చేసిన ప్రకటన తెలుగదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్ సిఇవోగా ఉన్న స్టూడియోఎన్ కు మంచి అవకాశాన్ని ఇచ్చింది. అదే సమయంలో చంద్రబాబుకు ఉత్సహాన్ని నింపింది. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదంటూనే తాను పులివెందుల శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేయబోనని, కడప పార్లమెంటు సీటు నుంచే పోటీ చేస్తానని చేసిన ప్రకటనను ఆసరాగా తీసుకుని వైయస్ జగన్‌ను టార్గెట్ చేసుకుంది. బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిని ఎదుర్కోలేకనే వైయస్ జగన్‌ శాసనసభకు పోటీ చేయడం లేదని స్టూడియోఎన్ వ్యాఖ్యానించింది. ఈ మేరకు వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా తీరొక్క కథనాలు ప్రసారం చేస్తున్న సాక్షి టీవీ చానెల్‌కు దీటుగా ఇంతకాలానికి వైయస్ జగన్‌ను వ్యతిరేకిస్తూ వ్యాఖ్యానం చేయడానికి స్టూడియోఎన్‌కు అవకాశం దక్కింది.

కాగా, తెలుగుదేశం పార్టీయే తమకు ప్రధాన ప్రత్యర్థి అని వైయస్ జగన్ చేసిన ప్రకటన చంద్రబాబుకు ఉత్సాహాన్ని నింపినట్లే ఉంది. కాంగ్రెసు తుడిచిపెట్టుకుపోతుందని, తమకు తెలుగుదేశం పార్టీతోనే పోటీ ఉంటుందని వైయస్ జగన్ ఆదివారం ప్రకటించారు. ఇది చంద్రబాబుకు సంతోషకరమైన విషయం. దానికితోడు, శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో కాంగ్రెసు తీరు చంద్రబాబుకు మంచి అవకాశాన్ని ఇచ్చింది. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, పార్టీ నాయకులు మాత్రమే కాకుండా కాంగ్రెసు తెలంగాణ నాయకులు కూడా తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసును, తెరాసను విమర్శించడానికి తెలుగుదేశం తెలంగాణ నాయకులకు అవకాశం చిక్కింది. అయితే, మరో వైపు చంద్రబాబుకు పార్టీ తెలంగాణ శాసనసభ్యులు కొంత మంది షాక్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+