మద్దెలచెర్వు సూరిపై దాడి: చమన్ వర్గమా, అనుచరులా?

స్కోడా కారులో ఉండగానే సూరిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. సూరిని అపోలో ఆస్పత్రిలోని ఐసియులో వెంటిలేటర్‌పై ఉంచారు. అతను బతికే అవకాశాలు తక్కువ అని అంటున్నారు. కారులోని ముందు సీటు గియర్ బాక్స్ పై రక్తం మరకలున్నాయి. అందులో ఇరుక్కుపోయిన సిగరెట్ ప్యాకెట్‌పై రక్తం మరకలున్నాయి. డ్రైవింగ్ సీటుపై కూడా రక్తం మరకలున్నాయి. అతని చెవి వెనక భాగం నుంచి ఒక బుల్లెట్ లోనికి దూసుకెళ్లింది. కడుపులోకి కూడా రెండు బుల్లెట్లు దూసుకుపోయినట్లు తెలుస్తోంది.
సూరిపై దాడి సంఘటనపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ అంటున్నారు. ప్రత్యక్ష సాక్షులను విచారించిన తర్వాత వివరాలు చెప్పగలమని ఆయన అన్నారు. మొత్తం మూడు బుల్లెట్లు అతని శరీరంలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. కాల్పుల తీరును బట్టి ప్రొఫెషనల్స్ కిల్లర్స్ అతనిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కారులో సూరితో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది.
నమ్మకద్రోహంతో కాల్పులు జరిపారని సూరి బంధువులు ఏడుస్తూ అంటున్నారు. అతను మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో న్యాయవాదిని కలిసినట్లు, ఆ తర్వాత తన చెల్లెలి ఇంటి నుంచి వెళ్లిపోతుండగా కాల్పులు జరిగినట్లు కూడా మరో కథనం వినిపిస్తోంది. చాలా దగ్గరి నుంచి అతనిపై కాల్పులు జరిపినట్లు అర్థమవుతోంది. కారు వద్ద రెండు బుల్లెట్లు కూడా పడి ఉన్నాయి.












Click it and Unblock the Notifications