మద్దెలచెర్వు సూరిపై ప్రత్యర్థుల కాల్పులు, కోమాలో అపోలోలో చేరిక

స్కోడా కారులో ఆయన ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. సూరి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. సూరిని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 13లో ప్రత్యర్థులు ఆయనపై కాల్పులు జరిపినట్లు సమాచారం. పక్కా సమాచారంతోనే సూరిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. సూరితో పాటు ఆయన అనుచరులు ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన సూరిని తొలుత స్థానికులు ఎవరూ గుర్తించలేదు. బెంగళూర్ నుంచి వచ్చిన ఆయన గత కొద్ది రోజులుగా హైదరాబాదులో ఉంటున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications