చంద్రబాబుకు గడ్డుకాలమే: 6 తర్వాత తెలంగాణ ఎమ్మెల్యేల ఆపరేషన్?

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లే. కాగా, సుద్దాల దేవయ్య, వేణుగోపాలాచారి, షిండేలు కూడా అదే బాట పడుతారని వార్తలు వస్తున్నాయి. సుద్దాల దేవయ్య, వేణుగోపాలాచారి ఆ వార్తలను ఖండించినప్పటికీ జనవరి 6వ తేదీ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుందామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ పరిణామాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రయత్నిస్తున్నారు. కానీ, కొంత మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీకి స్వస్తి చెప్పినప్పటికీ తెరాసలో చేరడం అనుమానమేనని అంటున్నారు. తెలంగాణ కోసం తాము పదవులకు రాజీనామా చేశామని చాటుకోవడమే తమకు కావాల్సిందనే అభిప్రాయంతో వారున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications