శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఊహించుకుంటున్నారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

6వ తేదీ సమావేశంలో శ్రీకృష్ణ కమిటీ నివేదికను బహిర్గతం చేస్తారని, దానిపై అదే రోజు చర్చ జరగదని ఆయన అన్నారు. గతంలో కూడా పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధులను సమావేశానికి పిలిచారని, ఇప్పుడు కూడా ఇద్దరేసి ప్రతినిధులను ఆహ్వానించడం సరైందేనని ఆయన అన్నారు. తాను వ్యక్తిగతంగా తెలంగాణకు కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. గత సమావేశానికి కాంగ్రెసు తరఫున తెలంగాణకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీమాంధ్రకు చెందిన కావూరి సాంబశివ రావు హాజరయ్యారు. ఇప్పుడు కూడా వారినే పిసిసి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ఏర్పాటు చేసిన అఖిల పక్షసమావేశానికి పంపే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications