నమ్మినబంటు భాను కిరణ్ చేతిలోనే మద్దెలచెర్వు సూరి హతం

Bhanu Kiran
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి తన ముఖ్య అనుచరుడు భానుకిరణ్ చేతిలోనే హతమయ్యాడు. సూరిపై దుండగులు కాల్పులు జరిపినప్పుడు భాను భయపడి పారిపోయాడనే వార్తలు వచ్చాయి. అయితే, సూరిని హత్య చేసి అతను పారిపోయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సూరిని భానునే హత్యచేసినట్లు పక్కనే ఉన్న సూరి మరో అనుచరుడు మధు కూడా నమ్మలేకపోయాడు. వెనుక నుంచి ఎవరో కాల్చారని అరుచుకుంటూ భాను కారు ఆపి దిగి వెళ్ళగానే మధు కూడా అది నిజమనే నమ్మాడు. భయపడి భాను పారిపోయాడని అనుకున్నాడు. సూరికి పెద్దసంఖ్యలో ప్రత్యర్థులు ఉండటంతో ఎవరో కారును వెంటాడుతూ వచ్చి కాల్పులు జరిపి పారిపోయి ఉంటారనే అందరూ భావించారు. ఆసుపత్రికి వచ్చిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత కానీ చిక్కుముడి వీడలేదు. సూరి కూర్చున్న సీట్లో మాత్రమే రక్తం ఉంది. ఒంటిపై ఎక్కడా ఎలాంటి గాయాల్లేవు. అన్నింటికీ మించి కారులో ఎక్కడా బుల్లెట్‌ తగిలిన గుర్తుల్లేవు. భాను చెప్పినట్లు వెనుక నుంచి ఎవరో కాల్చి ఉంటే కారు అద్దాలు కచ్చితంగా పగిలి ఉండాలి. ఒకవేళ తెరిచి ఉన్న అద్దాల్లో నుంచి కాల్పులు జరిపినా ఒకటి రెండు బుల్లెట్లయినా ఎక్కడో ఒకచోట తగిలి ఉండాలి. పైగా సూరికి మెడ వెనుక భాగంలో బుల్లెట్‌ గాయాలున్నాయి కాబట్టి కచ్చితంగా వెనుక నుంచే కాల్పులు జరిపి ఉండాలి.

కారు నడుస్తూ ఉన్నప్పుడు ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి మెడ వెనుక భాగంలో బయట్నుంచి కాల్పులు జరపడం సాధ్యంకాదు. మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు అతి దగ్గర నుంచి కాల్చినట్లు నిర్ధారించారు. వీటన్నింటినీ విశ్లేషించిన పోలీసులు కారులో వెనుక కూర్చున్న వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కచ్చితమైన అంచనాకు వచ్చారు. అన్నింటికీ మించి ఘటన జరిగిన ప్రాంతంలో చుట్టుపక్కల ఎవరికీ దీని గురించి తెలియకపోవడం గమనార్హం. ఒకవేళ బయటి వ్యక్తులే కాల్పులు జరిపి పారిపోయి ఉంటే తుపాకీ శబ్దం కొందరికైనా వినిపించి ఉండేది. కాల్పులు జరిగిన ఐదు గంటల సమయంలో రోడ్డు రద్దీగా ఉంది. కానీ ఎవరూ దీన్ని గుర్తించలేకపోయారు. క్రమంగా వీటన్నింటినీ విశ్లేషించిన పోలీసులు వెనుక సీట్లో కూర్చున్న భానునే ఈ హత్యకు పాల్పడి ఉంటాడని నిర్ధారించారు. సూరి సోమవారం ఉదయానికి బెంగళూరుకు తిరిగి వెళ్లాల్సి ఉంది. అయితే పని పూర్తి కాకపోవటంతో హైదరాబాద్‌లోనే ఉంటున్నానని, మంగళవారం ఉదయానికి తిరిగి వస్తానని బంధువులకు చెప్పినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+