బుధవారం ఢిల్లీకి రావాలని తెలంగాణ ఎంపీలకు అధిష్టానం ఆదేశాలు

ఇంతకుముందే కె కేశవరావు తదితర ఎంపీలు పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే ఒప్పించి తీసుకు వస్తామని, తెలంగాణ ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని, తెలంగాణ ఇవ్వకుంటే పార్టీ పదవులు వదులుకుంటామని వారు ప్రకటనలు గుప్పించిన నేపథ్యంలో కేంద్రం వారిపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. వారిని పిలిచి అదుపులో ఉంచేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ ప్రజల్లో ఉన్న తెలంగాణ సెంటిమెంటును ఈ భేటీలో అధిష్టానం దృష్టికి తీసుకు వెళతామని ఎంపీలు అంటున్నారు. గత 2009లో కేంద్రం ప్రకటించిన తెలంగాణకు కట్టుబడి ఉండాలని వారు అధిష్టానాన్ని కోరనున్నారు.












Click it and Unblock the Notifications