విశాఖలో వైయస్ జగన్ ఓదార్పు కట్టడికి కాంగ్రెసు కొత్త ఎత్తులు

YS Jagan
విశాఖపట్నం‌: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రను కట్టడి చేయడానికి విశాఖపట్నం జిల్లా కాంగ్రెసు నాయకులు కొత్త ఎత్తులు వేశారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు తమ పార్టీ కార్యకర్తలు ఎవరూ వెళ్లబోరని స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ద్రోణంరాజు శ్రీనివాస్ నేతృత్వంలో గడప గడపకు కాంగ్రెసు అంటూ ఓ కార్యక్రమం జరుగుతోంది.

కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెసు ప్లకార్డులు, బ్యానర్లతో ప్రజల వద్దకు వెళ్తున్నారు. బాధ్యత గల నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేయడం తగదని ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. పథకాల అమలులో లోపాలు ఉంటే ఎత్తిచూపవచ్చునని, కానీ విమర్శలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.

వైయస్ జగన్ వెంట తమ పార్టీ కార్యకర్తలు ఎవరూ వెళ్లడం లేదని, కార్యకర్తలంతా పార్టీ వెంటే ఉన్నారని ఆయన చెప్పారు. కాగా, వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు ప్రజల నుంచి ఆదరణ తగ్గిందని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ వ్యాఖ్యానిస్తోంది. గతంలో మాదిరిగా ఆదరణ లభించడం లేదని అంటోంది. అయితే, వైయస్ జగన్ ఓదార్పు యాత్ర ప్రసంగాల్లో మాత్రం ఏ మాత్రం మార్పు లేదు. సోమవారం మాట్లాడిన విషయాలను అదే వరుసలో, అదే రీతిలో మంగళవారం కూడా మాట్లాడారు. అయితే, జగన్‌కు ప్రజలు నీరాజనం పడుతున్నారని సాక్షి టీవీ చానెల్ వ్యాఖ్యానిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+