సాక్ష్యాధారాలతో మీడియా ముందుకు దిగ్విజయ్ సింగ్

2008వ సంవత్సరంలో గత ముంబయి దుర్ఘటనకు ముందు నవంబర్ 26వ తేదిన కర్కరే తనకు ఫోన్ చేశారని చెప్పారు. తనకు హిందూ మతతత్వ సంస్థల నుండి ముప్పు ఉన్న విషయాన్ని చెప్పారన్నారు. సంభాషణ రికార్డులను ఆయన మీడియా ముందు ఉంచారు. తనకు దురుద్దేశ్యాలను అంటగట్టిన వారంతా క్షమాపణలు చెప్పాలన్నారు. బిఎస్ఎన్ఎల్ నుండి తాను ఆధారాలు సంపాదించినట్టు చెప్పారు. మాలేగావ్ పేలుళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీలనుండి తనకు ఒత్తిళ్లు వచ్చాయని కర్కరే తనకు ఆ ఫోన్లో చెప్పారన్నారు. తనకు కర్కరే ఫోన్ చేసినట్టు చెప్పిన దానిపై మంత్రి ఆర్.ఆర్.పాటిల్ సందేహాలు వ్యక్తం చేయటం తనకు బాధ కలిగించిందన్నారు.












Click it and Unblock the Notifications