చంద్రబాబు వైఖరీ తట్టుకోలేక పార్టీ వీడుతున్నా: పోచారం

తెలంగాణలో ఉన్న చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలు నాలాగే ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ తీరు మారకపోతే ఇక్కడ కష్టమేనని చెప్పారు. తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం కావాలనే సెంటిమెంటు బలంగా నాటుకు పోయిందన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల మనోభావాల ప్రకారమే నడుచుకోవాల్సిన అవసరం ప్రజాప్రతినిధిగా తనకు ఉందన్నారు. కాగా సోమవారం పోచారం తన కార్యకర్తలతో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications