మంత్రి కుమారుడితో భాను లింక్స్, సూరి హత్యకు పెద్ద కుట్ర?

భానుకు ఖమ్మం జిల్లా నుంచి గన్ లైసెన్స్ లభించింది. ఈ లైసెన్స్ కోసం మంత్రి కుమారుడు సిఫార్సు చేశాడని అంటున్నారు. భాను బ్యాంక్ ఖాతాలోకి పెద్ద మొత్తంలో సొమ్ము పడినట్లు కూడా వినిపిస్తోంది. భాను కోవర్టుగా మారి హత్య చేశాడని సూరి బంధువులు ఆరోపిస్తున్నారు. భానును నమ్మవద్దని చెప్పినా వినేవాడు కాదని, సొంత బంధువులను కూడా నమ్మేవాడు కాదని సూరి మేనమామ సత్యనారాయణ రెడ్డి అంటున్నారు. భాను ఒక్కడే ఈ హత్య చేసి ఉండడని, భాను వెనక ఎవరో ఉన్నారని ఆయన అన్నారు. కాగా, సూరి హత్య వెనక పరిటాల రవి వర్గం లేదని సూరి చిన్నాన్న తమ్మిరెడ్డి అంటున్నారు. ఆస్తుల కోసం భాను, మధు కలిసి సూరిని హత్య చేశారని ఆయన ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications