చంద్రబాబును కలిసిన షిండే: రాజీనామా శరణ్యమన్న ఎమ్మెల్యే?

Chandrababu Naidu
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా జుక్కల్ శాసనసభ్యుడు హనుమంతు షిండే మంగళవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుని కలిశారు. తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోకుండా సుప్తావస్థనలో పెడుతున్నందున తెలంగాణ జిల్లాల్లో పార్టీపై ప్రజలకు అపనమ్మకం ఏర్పడినదని ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తు కోల్పోకుండా పార్టీకి రాజీనామా చేయడమే తమ ముందున్న ఏకైక మార్గమని షిండే చంద్రబాబుకు చెప్పినట్టుగా తెలుస్తోంది. పార్టీ ఏదో ఒక నిర్ణయం తీసుకొని ముందుగు వెళితే బాగుండేదని, ఏ నిర్ణయమూ తీసుకోక పోవటం వల్ల ప్రయోజనం మాట ఏమోగానీ అటు తెలంగాణలో ఇటు సీమాంధ్రలో తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది.

తెలంగాణకు స్పష్టమైన వైఖరి లేకపోవడంతో బాబ్లీపైనా, ఉద్యామాలు చేసిన విద్యార్థులపైన పెట్టిన కేసులపై తెలుగుదేశం పార్టీ చిత్తశుద్దితో పోరాడినా ప్రజలు నమ్మె స్థితిలో లేరని ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి దారిలోనే తాను కూడా పార్టీకి రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరతానని చెప్పినట్టు తెలుస్తోంది. షిండేను బాబు వారించినప్పటికీ ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+