గోలీ పేలితే పార్లమెంటును స్తంభింపజేస్తాం: బిజెపి జాతీయ అధ్యక్షుడు గడ్కరీ

Nitin Gadkari
అదిలాబాద్: దేశంలోకి ఉగ్రవాదులు జొరబడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం శాంతియుతంగా, న్యాయబద్దంగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రాంతంలో భారీ ఎత్తున పారా మిలటరీ దళాలను మోహరించడం దురదృష్టకరమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నితిన్ గడ్కరీ మంగళవారం అదిలాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ శంఖారావం బహిరంగ సభలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమకారులపై ఒక్క గోలి పేలినా పార్లమెంటును స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఆత్మత్యాగాల సెంటిమెంటు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఏం తెలుసునని విమర్శించారు.

తెలంగాణ అంశంపై కేంద్రమంత్రి నియమించిన శ్రీకృష్ణ కమిటీకి చట్టబద్దత లేదని ఆయన అన్నారు. ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధ్యమని సూచించారు. రాష్ట్రానికి ఎన్ని బలగాలను దించినా ప్రజల ఆకాంక్షముందు అవి వృథానే అన్నారు. దేశ సరిహద్దుల్లో సైన్నాన్ని పెట్టలేని కేంద్రం తెలంగాణ జిల్లాల్లో భారీ ఎత్తున పోలీసు దళాలను పెట్టిందన్నారు. గురువారం జరిగే ఎన్డీయే సమావేశంలో తెలంగాణ అంశంపై చర్చిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+