మద్దెలచెర్వు సూరి హత్య వెనక పరిటాల రవి అనుచరులు?

భాను కిరణ్ సోదరి హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం చేస్తోంది. ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. భాను కిరణ్ హైదరాబాదులోని కూకట్‌పల్లి పోలీసు స్టేషన్లో లొంగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అతను పోలీసుల అదుపులోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే భాను తమ ఆధీనంలో లేడని పోలీసులు చెబుతున్నారు. భాను కోసం గాలిస్తున్నట్లు వారు చెబుతున్నారు. సోదరిని విచారిస్తే భాను ఆచూకీ తెలుస్తుందని అనుకుంటున్నట్లు వారంటున్నారు. సూరి గన్‌మన్ మన్మోహన్ గన్‌తో భాను సూరిని కాల్చి చంపాడు. మన్మోహన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications