నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడ రౌడీలు, రక్తచరిత్ర సీక్వెల్‌లు నిషేధించాలి: టిడిపి నేత సోమిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Somireddy Chandramohan Reddy
నెల్లూరు: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ తీస్తున్న బెజవాడ రౌడీలతోపాటు రక్త చరిత్ర సీక్వెల్‌ను ప్రభుత్వం నిషేధించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో డిమాండ్ చేశారు. కాంగ్రెసు ప్రభుత్వం హయాంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. ఎవరికీ రక్షణ కల్పించని ప్రభుత్వం దండగ అన్నారు. ఫ్యాక్షనిస్టులను హీరోలుగా చూపించడం దర్శకుడు రామ్ గోపాల్‌వర్మకు తగదని సూచించారు.

6న కేంద్రహోంమంత్రి చిదంబరం ఏర్పాటు చేసిన అఖిలపక్షానికి తెలుగుదేశం పార్టీ హాజరు కావద్దని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి నివేదిస్తామని చెప్పారు. సమస్యకు కారణం కాంగ్రెసు పార్టీయే కాబట్టి దానికి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత కూడా ఆ పార్టీపైనే ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్యకు కాంగ్రెసు పార్టీయే కారణమని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X