మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి ప్రధాన స్థావరం బెంగళూరు

Maddelacheruvu Suri
హైదరాబాద్: ముఠా కక్షలను కుటుంబ వారసత్వంగా పొందిన మద్దెలచెర్వు సూరికి మొదటి నుంచి బెంగళూరు ప్రధాన స్థావరంగా ఉండేది. ఇటీవల చర్లపల్లి జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా సూరి ఇక్కడే ఎక్కువగా ఉన్నారు. బెంగళూరు నగరంలోని కె.ఆర్‌.పురం, హెబ్బాళలతో పాటు మరో మూడు ప్రాంతాల్లో సూరికి ఇళ్లున్నాయి. అయితే తానెక్కడ ఉంటున్నాడో ముఖ్య అనుచరులు ఒకరిద్దరికి మినహా ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకునే వాడు. తాను ఎవరినైనా కలవాలనుకున్నప్పుడు చాలా రహస్యంగా ఫోన్‌ సమాచారం కూడా లేకుండా వెళ్లేవాడు. భార్యతో విడిగా ఉంటున్న సూరి తమ కుమారుడిని ఆర్‌.టి.నగర్‌లోని ఓ పాఠశాలలో చదివిస్తున్నాడు.

ఇటీవల రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో విడుదలైన 'రక్తచరిత్ర' మొదటి భాగాన్ని బెంగళూరులోని పీవీఆర్‌ థియేటర్లో తన అనుచరులతో కలిసి సూరి వీక్షించాడు. రెండో భాగాన్ని మంత్రిమాల్‌లోని ఒక థియేటర్లో చూశారు. ఆ సమయంలో అనంతపురం జిల్లా నుంచి 50కు పైగా వాహనాల్లో సూరి అనుచరులు తరలి వచ్చారు. రెండు సార్లు థియేటర్‌లోని సీట్లన్నింటినీ సూరి అనుచరులే కొనుగోలు చేశారు. బెంగళూరు నగరానికి చెందిన ఇద్దరు శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన మరికొందరు శాసనసభ్యులు కూడా సూరితో కలిసి రక్తచరిత్ర రెండు భాగాలను తిలకించారు.

రామానాయుడు స్టూడియోలో రవిపై జరిగిన హత్యాయత్నానికి పథకం బెంగళూరులోనే జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. గౌరిబిదనూరుకు సమీపంలో ఆయన సోదరి, మరి కొందరు బంధువులు నివాసమున్నారు. నగరం చుట్టుపక్కల భూ వ్యాపారాలు చేసే కొందరు వ్యాపారులతో సూరికి సంబంధాలు ఉండేవి. తొమ్మిదో దశకం మధ్యలో పీణ్యలో ఒక గుత్తేదారుపై యాసిడ్‌ పోసిన కేసులో సూరి మొదటి ముద్దాయి. ఆ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. గత వారం కూడా ఆ కేసు విచారణకు సూరి ఇక్కడి కోర్టు ముందు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+