సూరికి మేం కారు ఇవ్వలేదు, శ్రీనివాస్‌కు ఇచ్చాం: గారపాటి రత్నకుమార్

పది రోజుల క్రితం గారపాటి రత్నకుమార్ కుటుంబం అమెరికాకు వెళ్లింది. నిజానికి, వారంతా ఒక్క రోజు ముందే హైదరాబాద్ రావాల్సింది. అమెరికాలో మంచు కురుస్తుండడం వల్ల ఒక్క రోజు ఆలస్యమైంది. రాగానే వారు సిసిఎస్ పోలీసుల ముందు గారపాటి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
తాము అమెరికాకు వెళ్లే ముందు తమ మిత్రుడు శ్రీనివాస్‌కు ఇచ్చామని, ఆ తర్వాత ఏమైందో తెలియదని, అది సూరి చేతిలోకి ఎలా వెళ్లిందో తెలియదని గారపాటి రత్నకుమార్ చెప్పినట్లు సమాచారం. శ్రీనివాస్ నుంచి సూరి తీసుకుని వెళ్లి ఉండవచ్చునని ఆయన చెప్పారు. దీంతో శ్రీనివాస్‌ను కూడా పోలీసులు విచారించినట్లు సమాచారం.
తన నుంచి మధుమోహన్ కారు తీసుకుని వెళ్లాడని, ఒక గంటలో వస్తామని చెప్పి తీసుకెళ్లాడని శ్రీనివాస్ చెప్పినట్లు సమాచారం. మధుమోహన్ కావాలనే శ్రీనివాస్ నుంచి ఆ కారు తీసుకుని వెళ్లాడా, మరెందుకు తీసుకుని వెళ్లాడనేది తేలాల్సి ఉంది. అయితే, సూరి తనకు ఉన్న ముప్పు దృష్ట్యా కార్లు మారుస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఆ కారును వాడారా అనేది కూడా తెలియదు.












Click it and Unblock the Notifications