ఎవరీ భాను కిరణ్, ఎందుకు మద్దెలచెర్వు సూరిని హత్య చేశాడు?

సూరి మద్యం సేవించినప్పుడు భానును బూతులు తిడతాడని పోలీసులు చెబుతున్నారు. ఇది నిత్యకృత్యంగా మారిందని, దీంతో విసుగుచెందిన భాను ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండొచ్చని మరో వాదన వినిపిస్తోంది. ఇంకో కథనం ప్రకారం..పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడైన సూరి అంటే పడనివారు చాలామంది ఉన్నారు. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన సూరిపై వీరి కన్నుపడిందని, వారిలో ఎవరైనా భానుతో ఒప్పందం కుదుర్చుకొని సూరిని కడతేర్చి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భాను పట్టుబడితే తప్ప అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు.
తాను కొనిచ్చిన ఆయుధమే తన ప్రాణం తీస్తుందని సూరి ఏనాడూ వూహించి ఉండడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సూరి కొంతకాలం ఇద్దరు పైవేటు భద్రతా సిబ్బందిని నియమించుకున్నాడు.అనుమతిలేకుండా ఆయుధాలతో ఉన్న వీరిని కొద్దిరోజుల క్రితం పోలీసులు అరెస్టుచేశారు. దాంతో తానే పిస్తోలు కొని, ఎల్లప్పుడూ తన పక్కనే ఉండే భానుకు ఇచ్చాడు. భానునే వ్యక్తిగత అంగరక్షకుడిగా వాడుకుంటున్నాడు. ఇప్పుడు తాను కొనిచ్చిన ఆయుధమే సూరి ప్రాణాలు తీసింది.












Click it and Unblock the Notifications