రాష్ట్రం కలిసి ఉన్నా, విడిపోయినా అభ్యంతరం లేదు: మంత్రి బొత్స
State
oi-Srinivas G
By Srinivas
గుంటూరు: తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎలా వచ్చినా దానిని ఆమోదిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ గుంటూరులో బుధవారం స్పష్టం చేశారు. తెలంగాణ అంశంపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానిని తాము ఆమోదిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని, దేశంలోని సామాన్య ప్రజలంతా రాజ్యాంగం ప్రకారం తమకు ఉండాల్సిన హక్కులు, సౌకర్యాలు ఉండాలని కోరుకుంటున్నారు. అందరూ శాంతియుతంగా, సమానంగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రం విడిపోయినా, కలిసి ఉన్నా తనకు అభ్యంతరం లేదని చెప్పారు. అందరూ బాగుండటమే కావాలన్నారు. కృష్ణా నీటి విషయంలో బ్రజేష్ కమిటీ ట్రిబ్యునల్ తీర్పుతో మన రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఈ విషయంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఇదే యోచనలో ఉన్నాయన్నారు. కృష్ణా తీర్పు వల్ల రాష్ట్రంలో పంటలకు నష్టం జరుగుతుందన్నారు.