రాష్ట్ర విభజన అంత సులువైన విషయం కాదు: ఎంపీ కావూరి సాంబశివరావు

Kavuri Sambhasiva Rao
హైదరాబాద్: ఒక రాష్ట్రాన్ని విభజించడం అంత సులువైన విషయం కాదని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు బుధవారం న్యూఢిల్లీలో అన్నారు. ప్రణబ్ ముఖర్జీతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ప్రణబ్ తో కావూరి, ఉత్తంకుమార్ రెడ్డి, వీరప్పమొయిలీ భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులుగానే మేము కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యామని ఆయన చెప్పారు. గురువారం హోంమంత్రి చిదంబరం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఏం మాట్లాడాలనే తాము చర్చించుకున్నామన్నారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదికను మంత్రి తమకు ఇచ్చిన తర్వాత తమకు దాని అధ్యయనానికి కొంత సమయం ఇవ్వాలని ప్రణబ్ ను కోరామన్నారు. ఆయన దానికి సానుకూలంగా స్పందించారని తెలిపారు. సుమారు రెండు నుండి మూడు వారాల సమయం ఇస్తారని అభిప్రాయపడ్డారు. నివేదికలోని అంశాలు పరిశీలించిన తర్వాత తెలంగాణకు అనుకూలమా, సమైక్యాంధ్రకు అనుకూలమా అని చెప్పగలుగుతామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+