టాలీవుడ్ లింక్స్: తెలుగు సినిమాలకు మద్దెలచెర్వు సూరి పెట్టుబడులు

హైదరాబాదులో సూరి పలువురు నిర్మాతలతో చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం విడుదలైన పలు సినిమాల్లో అతని పెట్టుబడులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్ర సినిమాకు సూరి పెట్టుబడి పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే, దాన్ని సూరి కొట్టిపారేశాడు. తాను పెట్టుబడి పెడితే రక్తచరిత్ర మొదటి భాగంలో పరిటాల రవిని ఎందుకు హీరోగా చూపిస్తారని అతను అడిగాడు. కానీ, అతని మనసు మాత్రం పూర్తిగా సినిమా వైపు మళ్లిందని అంటున్నారు. తెరపై తనను హీరోగా చూసుకోవాలని కూడా అతను కలలు కన్నాడని ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications