కమిటీ పేరుతో కేంద్రం కుట్ర, శ్రీకృష్ణతో ఏడాది వృథా: కోదండరామ్

కేంద్రం అఖిలపక్షం పేరుతో సమస్యను మళ్లీ తెచ్చే కుట్ర చేస్తుందన్నారు. అఖిలపక్షం పేరుతో ఒక్కో పార్టీనుండి ఇద్దరిని పిలవటం సబబు కాదన్నారు. ఇద్దరిని పిలవడం వల్ల ఫలితం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కమిటీలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అఖిలపక్షానికి తెలుగుదేశం పార్టీ వెళ్లకూడదని కోదండరామ్ డిమాండ్ చేశారు. పార్లమెంటులో బిల్లు పెట్టడానికి అన్ని పార్టీల వారు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఈనెల, వచ్చేనెలలో దశలవారీగా ఉద్యమాలు చేస్తామని ఆయన చెప్పారు. బిల్లు పెట్టే వరకు తమ ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు.












Click it and Unblock the Notifications