బాబుకు దెబ్బ మీద దెబ్బ: టీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య

అయితే ఈ తీరుతో తెలుగుదేశం పార్టీ కొంత ఊపిరి పీల్చుకోగా, టీఆర్ఎస్ ఖంగుతిన్నది. చివరకు గజ్జెల కాంతంని మధ్యవర్తిగా సుద్దాల వద్దకు టిఆర్ఎస్ పంపినట్టు తెలుస్తోంది. సుద్దాలతో ఉదయంనుండి చాలాసేపు గజ్జెల కాంతం చర్చలు జరిపారు. ఆయన చర్చలు ఫలించినట్టున్నాయి. కాస్త ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. ఆలోచిస్తానని చెప్పినప్పటికీ చర్చల ఫలించాయని, ఆయన టిఆర్ఎస్‌లో చేరే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నట్టు సమాచారం. వారం రోజుల్లో ఆయన టిఆర్ఎస్ లోకి చేరే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications