చంద్రబాబు మెడకు తెలంగాణ శాసనసభ్యుల ఉచ్చు

Chandrababu Naidu
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి తెలుగుదేశం తెలగాణ శానససభ్యుడు ఉచ్చు బిగిస్తున్నారు. దాదాపు పది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీని వీడిపోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు వార్తలు రావడంతో చంద్రబాబు రంగంలోకి దిగారు. వారిని బుజ్జగించడానికి తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డిని ప్రయోగించారు. దాంతో తాత్కాలికంగా కొంత మేరకు రాజీనామాల పర్వం ఆగిపోయింది. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస రెడ్డితో పాటు వేణుగోపాలాచారి, సుద్దాల దేవయ్య, హనుమంత్ షిండే పార్టీ నుంచి వెళ్లిపోయి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరడానికి సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి. వారి కదలికలు కూడా అదే రీతిలో ఉన్నాయి. అయితే, చంద్రబాబు స్వయంగా మాట్లాడడంతో కాస్తా వెనక్కి తగ్గారు. కానీ, వారు చంద్రబాబుకు తీవ్రమైన షరతులు పెడుతున్నట్లు సమాచారం.

తెలంగాణకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని వారు చంద్రబాబును డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. తన నియోజకవర్గంలో కార్యకర్తలతో మాట్లాడిన కరీంనగర్ జిల్లా చొప్పదండి శాసనసభ్యుడు సుద్దాల దేవయ్య అదే విషయం చెప్పారు. తెలంగాణ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని కార్యకర్తలు కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయడంతో దానికి సంపూర్ణమైన అధికారాలు ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక శాఖ స్వతంత్రంగా కార్యకలాపాలు చేపడుతుందని, ఈ శాఖ కార్యకలాపాల్లో చంద్రబాబు జోక్యం చేసుకోవద్దని కూడా వారు అడుగుతున్నారు. ఈ శాఖ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తుందని వారంటున్నారు. అంటే, పూర్తిగా చంద్రబాబు అధికారానికి దూరంగా ఇది పనిచేస్తుంది. దీనిలో చంద్రబాబు ప్రమేయం ఉండదు. ఈ ప్రత్యేక శాఖను ఏర్పాటు పేరుతో ప్రస్తుతానికి పార్టీ శాసనసభ్యులు రాజీనామాలు చేయడానికి సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం తమ ముందరి కాళ్లకు బంధం వేస్తుందనేది వారి ప్రధాన ఆక్షేపణ. అయితే, ప్రత్యేక శాఖ ఏర్పాటుకు సాంకేతికపరమైన ఇబ్బందులున్నాయని అంటున్నారు. తెలంగాణ శాసనసభ్యుల ఒత్తిడిని తగ్గించడానికే ఆ కారణం చెబుతున్నారనే అభ్యంతరాలను వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+