హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మా వాడు మద్దెలచెర్వు సూరిని చంపలేదు: భాను కిరణ్ తల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
హైదరాబాద్: తన కుమారుడు మద్దెలచెర్వు సూరిని హత్య చేసి ఉండడని భాను కిరణ్ తల్లి అంటోంది. తన కుమారుడు అటువంటివాడు కాడని ఆమె ఓ టీవీ చానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడింది. ఒక వేళ తన కుమారుడు ఆ పని చేసి ఉంటే సూరి కుటుంబానికి తాను సానుభూతి తెలియజేస్తున్నానని ఆమె అన్నారు. సూరిని తన కుమారుడు హత్య చేశాడంటే నమ్మలేనని ఆమె అన్నది.

భాను కిరణ్ బయటకు వచ్చి ఏం జరిగిందో చెప్పాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. తన కుమారుడికి పగ పెట్టుకోవడమనేది తెలియదని ఆ తల్లి నమ్ముతోంది. భాను కిరణ్ ఎక్కుడున్నాడో తెలియదని ఆమె అన్నారు. సూరి హత్య కేసులో ప్రధాన అనుమానితుడు భాను కిరణ్ అనే విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X