తెలంగాణ బిల్లు పెట్టకుంటే పదవీ త్యాగాలు: కాంగ్రెసు తెలంగాణ నేతలు

తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసుకోవడానికి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి 29 మంది శాసనసభ్యులు, 9 మంది ఎమ్మెల్సీలు, ఏడుగురు పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు. మంత్రులు కె. జానారెడ్డి, బసవరాజు సారయ్య, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ప్రతినిధులు వచ్చి ధర్నా నిర్వహించారు. మీడియాపై విధించిన ఆంక్షలను ఎత్తేయించాలని వారు కాంగ్రెసు నాయకులను డిమాండ్ చేశారు. అందుకు కాంగ్రెసు నాయకులు సానుకూలంగా ప్రతిస్పందించారు. ఆ తర్వాత తెలంగాణ న్యాయవాదులు సమావేశంలోకి వచ్చి తెలంగాణ నాయకులను ఘెరావ్ చేశారు. నల్లగొండ జిల్లా కోదాడ శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని వారు చుట్టుముట్టారు. పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications