కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తారు: జీవన్ రెడ్డి

తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెసు పార్టీయేనని, ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తమ ఏకైక డిమాండ్ అని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రతిపాదించాల్సిందేనని ఆయన అన్నారు. బిల్లు పెట్టకపోతే కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తారని ఆయన అన్నారు. శాసనసభ ఆవరణలో మీడియాపై విధించిన ఆంక్షలను ఎత్తేయాలని ఆయన డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరారు. తాము ఏ విధమైన చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, తమపై కూడా ఆంక్షలు విధించడం సరి కాదని, ఆంక్షలు అత్యవసర పరిస్థితిని తలపిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications