హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును పెట్టాల్సిందే: కొండా సురేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

Konda Surekha
హైదరాబాద్: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును పెట్టాల్సిందేనని వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ అన్నారు. తాము తెలంగాణ కోసం పోరాటం చేస్తామని ముందే చెప్పామని ఆమె శుక్రవారం ఓ టీవీ చానెల్ ప్రతనిధితో అన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు శాసనసభ్యులు మంత్రి పదవులు తీసుకోవద్దని, తీసుకుంటే తెలంగాణ రాదని తాను ముందే చెప్పానని ఆమె అన్నారు.

తాను రాజీనామా చేస్తే తెలంగాణ వస్తుందంటే రాజీనామా చేస్తానని ఆమె అన్నారు. ఇంతకు ముందు 11 మంది రాజీనామా చేసినా తెలంగాణ రాలేదని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ కోసం తాను విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తానని ఆమె చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X