కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి పదవి అవసరమా: వైయస్ వివేకానందకు వ్యతిరేకంగా కరపత్రం

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy
కడప: కడప జిల్లాలో బాబాయ్ వైయస్ వివేకానందరెడ్డి, అబ్బాయ్ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి మధ్య కరపత్రాల యుద్ధం కొనసాగుతోంది. గతంలో మంత్రి వైయస్ వివేకానంద పులివెందులలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి పేరిట ఓదార్పు యాత్ర, సోనియాగాంధీ అపాయింట్‌మెంటు, వైయస్ వివేకానంద మంత్రి పదవి, కుటుంబ వ్యవహారాలపై జగన్‌ను ప్రశ్నిస్తూ వైయస్ వివేకానందను సమర్థిస్తూ ఓ కరపత్రం విడుదలయింది. అందుకు ప్రతిగా ఏది నిజం పేరుతో వైయస్ జగన్ వర్గానికి అనుకూలంగా మంత్రి పదవి కోసం ఆత్మగౌరవం అవసరం లేదా అని వివేకానందరెడ్డిని ప్రశ్నిస్తూ మరో కరపత్రం వచ్చాయి.

అప్పటినుండి వారి మధ్య ప్రత్యక్ష్యంగా కాకుండా పరోక్షంగా కరపత్రాల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం మళ్లీ ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో జగన్‌పై విమర్శలు గుప్పించుకుంటూ కరపత్రం వచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో వైయస్ వివేకానందరెడ్డిని సమర్థిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో మాజీ పార్లమెంటు సభ్యుడు జగన్‌ను సమర్థిస్తూ మీకు మంత్రి పదవి అవసరమా అని ఆ కరపత్రంలో వివేకానందను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X