హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణ కమిటీ నివేదిక: ఎక్కడ వేసిన గొంగళి అక్కడే

By Pratap
|
Google Oneindia TeluguNews

Srikrishna Committee
హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే పరిస్థితి కొనసాగడం విచిత్రమే. కమిటీ చేసిన సూచనలు, విశ్లేషణలు విషయాన్ని మొదటికే తెచ్చింది. తెలంగాణ, సీమాంధ్ర రాజకీయ నాయకుల మధ్య లేదంటే ప్రజల మధ్య ఏకాభిప్రాయ సాధనకు అవసరమైన అంశమేదీ శ్రీకృష్ణ కమిటీ నివేదికలో లేదు. ఏడాది క్రితం ఏ సమస్య పరిష్కారానికైతే కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించిందో ఆ సమస్యకు పరిష్కారం నివేదిక వల్ల లభించలేదు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల్లో ఇరు ప్రాంతాల రాజకీయ నాయకుల మధ్య విభేదాలు, రెండు విధానాలకు అవసరమైన పరిష్కారాన్ని కమిటీ చూపలేకపోయింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించగానే సీమాంధ్ర నాయకులు పార్టీలకు అతీతంగా వ్యతిరేకించి రాజీనామాలు చేశారు. దాంతో కేంద్ర హోం మంత్రి వెనక్కి తగ్గారు. దాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణలో ఉద్యమాలు చెలరేగాయి. తెలంగాణ, సీమాంధ్ర మధ్య కొనసాగుతున్న విభేదాలు, భిన్న వాదనల నేపథ్యంలో ఆ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని వేసింది. ఆ సమస్యకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక సూచించిన పరిష్కారం ఏదీ లేదు. అందువల్ల ఇరు ప్రాంతాల రాజకీయ నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు అలాగే కొనసాగుతాయి. ఇప్పటికే తెలంగాణలో ఆందోళనలు ఊపందుకున్నాయి.

శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులు కూడా గందరగోళంగా ఉన్నాయి. ఆచరణ సాధ్యం కావంటూ మూడు సూచనలు చేయడం విచిత్రమే. ఆచరణ సాధ్యం కాని ప్రత్యామ్నాయాలు ఇవ్వడం ఎందుకో అర్థం కాదు. మొత్తంగా విశ్లేషణలో కూడా లోతు లేదు. పైపైన లెక్కలు చూపి విశ్లేషణ చేసినట్లుగా ఉంది. తెలంగాణలో వ్యవసాయానికి విద్యుతు వాడకంపై, తెలంగాణలో సాగు నీటి ప్రాజెక్టులు చేపట్టకపోవడంపై కమిటీ చేసిన విశ్లేషణను అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X