సిపిలకు కలిసి రాని బెజవాడ: ఆరేళ్లలో ఆరుగురు

2004 సంవత్సరంలో అప్పటీ కమిషనర్ కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద తీవ్ర తొక్కిసలాట జరిగింది. కృష్ణా పుష్కరాలకు అత్యధికంగా భక్తులు వస్తారని తెలిసినప్పటికీ సరియైన భద్రత చర్యలు తీసుకోలేదంటూ కృష్ణప్రసాద్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ తర్వాత ఉమేష్ షరాఫ్ వచ్చారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి 2005లో చాలామంది భవానీలు వచ్చారు. ఆ సమయంలో 5గురు భవానీలు మృతి చెందారు. ఆ కారణంగా ఉమేష్ బదిలీ అయ్యారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఆయేషా హత్య కేసు కారమంగా సివి ఆనంద్ బదిలీ అయ్యారు. 2009లో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యమం కారణంగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నిరాహార దీక్ష చేస్తూ పారిపోయి హైదరాబాద్‌కు వచ్చారు. ఉద్యమం కారణంగా సరియైన చర్యలు తీసుకోలేదంటూ కమిషనర్ రాజేంద్రనాథ్‌రెడ్డిని ఏకంగా సస్పెండ్ చేశారు.
తాజాగా బెజవాడ పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులును కూడా ప్రభుత్వం బదిలీ చేసి ఏ పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచింది. అయితే ఈ ఆరేళ్లలో మిగిలిన నలుగురికంటే ప్రస్తుత కమిషనర్ సీతారామాంజనేయులు ఘటనే అన్నింటికంటే సంచనలం కలిగించింది. ఇప్పటి వరకు కేవలం భద్రతా చర్యల కారణంగానే ఆయా కమిషనర్‌లను ప్రభుత్వం బదిలీ చేయటమో, లేదా సస్పెండ్ చేయడమో జరిగింది. కానీ సీతారామాంజనేయులు విషయంలో భద్రతా చర్యలు కాకుండా సెక్సు ఆరోపణల కారణంగా ఆయనపై వేటు పడింది. వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్టతో పాటు కమిషనర్ ఈ స్థాయికి దిగజారడంతో అందరూ ఛీ కొడుతున్నారు. మొత్తానికి బెజవాడ కమిషనర్‌గా ఎవరికి కలిసి వచ్చినట్లుగా కనిపించడం లేదు. ప్రస్తుతం అమిత్ గార్గ్ కమిషనర్‌గా రానున్నట్టు సమాచారం.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications