వైయస్ జగన్ పై పోటీకి సై, కడపలోనే తేల్చుకుందాం: డిఎల్ రవీంద్రారెడ్డి

ధనమదంతో తన పత్రికలో వైయస్ జగన్ ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయిస్తున్నారని ఆయన విమర్శించారు. వైయస్ జగన్ వెంట వెళ్లిన శాసనసభ్యులు రాజీనామాలు చేసి, తిరిగి వైయస్ జగన్ పార్టీ కింద పోటీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ గనుల తవ్వకాల్లో వైయస్ జగన్ పాత్ర ఉందని, కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రకటన ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోందని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీపై తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని, తెలంగాణ కోసం శాసనసభలో తీర్మానం పెట్టాలంటే అందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications