ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసు కాల్పులు, విద్యార్థికి గాయాలు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసుల తీరుపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కెటి రామారావు తీవ్రంగా తప్పు పట్టారు. పోలీసులు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పోలీసుల అతి వల్ల పరిస్థితి విషమిస్తోందని ఆయన అన్నారు. ఉస్మానియా పక్కన ఉన్న మాణిక్యేశ్వరి నగర్‌లోకి వెళ్లి కొడుతున్నారని ఆయన ఆరోపించారు. మీడియాపై ఆంక్షలను తప్పుపట్టారు. విద్యార్థులను ఫాక్షనిస్టుల మాదిరిగా, గూండాల మాదిరిగా చూస్తున్నారని ఆయన విమర్శించారు. పోలీసులు మీడియాను భయపెడుతున్నారని ఆయన అన్నారు. ప్రజల సమాచార హక్కును కాలరాస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications