తెలంగాణ ఆత్మకు దృశ్యరూపం జై బోలో తెలంగాణ: కె చంద్రశేఖర రావు

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: శంకర్ దర్శకత్వంలో రూపొందిన జై బోలో తెలంగాణ సినిమా తెలంగాణ ఆత్మకు దృశ్యరూపమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. జై బోలో తెలంగాణ ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన శనివారం మాట్లాడారు. తెలంగాణను పిడికెడు మంది పెట్టుబడిదారులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని, ప్రజా బాహుళ్యానికి తెలంగాణపై వ్యతిరేకత లేదని ఆయన అన్నారు. జై బోలో తెలంగాణ సినిమా తీసిన శంకర్‌ను ఆయన అభినందించారు.

ఓ కళాకారుడిగా తాను జై బోలో తెలంగాణ సినిమాలో నటించానని, ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రజలు తనను ఎంతో అభిమానించారని సినీనటుడు జగపతి బాబు అన్నారు. ఓ కళాకారుడిగా తనకు కుల, మత, ప్రాంతీయాభిమానాలు లేవని ఆయన అన్నారు. ప్రజల భాషను కాపీ కొట్టి తాము పెద్దవాళ్లమయ్యామని తెలంగాణ ప్రజా ఫ్రంట్ చైర్మన్ గద్దర్ అన్నారు. కెసిఆర్ తెలంగాణ రాజకీయ శక్తులను ఏకం చేయాలని, తాను సాంస్కృతిక రంగాన్ని ఏకం చేస్తానని ఆయన చెప్పారు. తెలంగాణను అడ్డుకునేవారికి మాత్రమే తన సినిమా వ్యతిరేకంగా ఉంటుందని దర్శకుడు శంకర్ అన్నారు. రాష్ట్రాలుగా విడిపోయి, ప్రజలుగా కలిసుందామని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను అంగీకరించాల్సిందేనని ప్రముఖ సినీ నటుడు నారాయణ మూర్తి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+