బెంగళూరు: సూరి హత్య కేసులో ప్రధాన నింధితుడుగా అనుమానిస్తున్న భానును యలహంక, హెబ్బాల రోడ్డు గెస్ట్ హౌస్ లో హైదరాబాదు, అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే అతని అనుచరులను ఇద్దరిని అదుపులోకి తీసుకొన్నారు. సూరి హత్య కేసుకి రాజకీయరంగుతో పాటు, వర్గ రాజకీయాలు తోడైనాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే భాను ని అరెస్ట్ చేసినట్టు బెంగళూరు పోలీసు కమీషనర్ శంకర్ బిదిరి, జాయింట్ పోలీస్ కమీషనర్(సిసిబి)అలోక్ కుమార్ దృవీకరించలేదు. సూరి హత్య కేసులో, కర్ణాటక రాజకీయ అధికార పార్టీ నాయకులతో పాటు, ఒక ప్రభుత్వ అధికారిని పోలీసులు విచారించడానికి సిద్దమయ్యారు.