వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు సోనియా గాంధీ వ్యతిరేకమే, కెసిఆర్ ‌పై బలంపై భయాలు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ‌: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణకు అనుకూలంగా లేరని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులకు స్పష్టంగా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. తమ పార్టీకి కలిగే లాభనష్టాలను బేరీజు వేసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా వెళ్లకపోవడమే మంచిదని ఆమె ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. తెలంగాణ ఇవ్వడం వల్ల రెండు ప్రాంతాల్లోనూ పార్టీకి నష్టం జరుగుతుందని ఆమె అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. సీమాంధ్రలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఊపు మీద ఉండడంతో తెలంగాణపై ఆమె వెనక్కి తగ్గినట్లు భావిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం పల్ల క్రెడిట్ అంతా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కొట్టుకుపోతారని, దానివల్ల కాంగ్రెసుకు తెలంగాణలో వచ్చే సీట్లు కూడా తగ్గిపోతాయని ఆమె అనుకుంటున్నారని చెబుతున్నారు. తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో వైయస్ జగన్ మరింత బలం పుంజుకుంటారని అంచనా వేశారని తెలుస్తోంది. దీనివల్ల రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెసుకు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగతుందని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెసుతో కలిసిపోతామని కెసిఆర్ చెబుతున్న మాటలను సోనియా నమ్మడం లేదని చెబుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోవడమే మంచిదని ఆమె అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ఇవ్వాలని కోరుతున్న తమ పార్టీ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులకు, నాయకులకు మాత్రం ఆమె కొంత సర్దుబాటు ధోరణితో మాటలు చెబుతున్నారు. ఓ ఏడాది పాటు ఆగాలని, ఈలోగా వైయస్ జగన్ రాజకీయాలను తిప్పికొట్టగలమని, అంతదాకా ఆగాలని ఆమె చెబుతున్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X