పార్టీని వీడటం లేదు, కలిసి తెలంగాణ కోసం పోరాడుతం: నాగం

చంద్రబాబు నాయకత్వంలోనే మేము తెలంగాణ సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ వీడుతున్న మాట మాత్రం అవాస్తమవమన్నారు. అయితే కొన్ని అభిప్రాయ బేధాలు ఉన్న మాట వాస్తవమేనన్నారు. సమన్వయ కమిటీతో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని చెప్పారు. తాము తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాఖకోసం చంద్రబాబును కోరినట్టు చెప్పారు.
మా నాయకుడు చంద్రబాబే అని మరో నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో తెలంగాణ కోసం పోరాడుతామని చెప్పారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అన్న కాంగ్రెస్ పార్టీ తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications