తెలంగాణ కాంగ్రెసును ముక్కలు చేసేందుకు దుష్టశక్తుల కుట్ర: కెకె

మంగళవారం తెలంగాణ కాంగ్రెసు నాయకుల సమావేశం యధాతథంగా నిర్వహిస్తామని చెప్పారు. సమావేశాన్ని పార్లమెంటు సభ్యులు రద్దు చేయమని కోరినట్లు కొందరు అలజడి సృష్టిస్తున్నారన్నారు. అందరూ సమావేశానికి అంగీకారం తెలిపారని చెప్పారు. సమావేశం రద్దు కాదని చెప్పారు. కాగా తెలంగాణ యాక్షన్ ఫోరం కమిటీ సభ్యుడు, శాసనమండలి సభ్యుడు యాదవరెడ్డి కూడా సమావేశం ఉంటుందని ప్రకటించారు. సోమవారం ఉదయం తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు ఎంపీలు సమావేశాన్ని రద్దు చేయాలని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రాజీనామాలు చేయవలసి వస్తుందనే వారు సమావేశాన్ని రద్దు చేయాలని కోరినట్లు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications