హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రముఖ హీరోయిన్‌తోనూ, ఆరుగురు నిర్మాతలతోనూ భాను కిరణ్ లింక్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భానుకు సినీ పరిశ్రమతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆరుగురు సినీ నిర్మాతలకు, ఒక ప్రముఖ హీరోయిన్‌ కు స్థలాల కొనుగోళ్లలో సహకరించి, వారి తరఫున సెటిల్ ‌మెంట్లు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నలుగురు నిర్మాతలకు, కేరళకు చెందిన ప్రముఖ గ్లామర్‌ హీరోయిన్ ‌కు మాదాపూర్‌ పరిసర ప్రాంతాల్లో స్థలాలు ఇప్పించినట్టు తెలిసింది. మిగిలిన ఇద్దరు నిర్మాతలకు నేరుగా సూరితోనే సంబంధాలు ఉన్నాయి. వారికి అవసరమైన స్థలాలను ఇప్పించేందుకు నేరుగా సూరినే రంగంలోకి దింపినట్లు సమాచారం. నలుగురు నిర్మాతలు, ప్రముఖ గ్లామర్‌ హీరోయిన్ ‌తో పరిచయాలు పెంచుకున్న భానుకిరణ్‌ అప్పుడప్పుడూ వారి వాహనాలను కూడా వినియోగించుకున్నాడు.

కొందరు హీరోయిన్ల వ్యక్తిగత కార్యదర్శులతో మాట్లాడి తనకు తెలిసిన నలుగురు నిర్మాతల ద్వారా వారికి ఛాన్సులిప్పిస్తామంటూ భాను కిరణ్ కార్యకలాపాలు కొనసాగించాడు. కొండాపూర్‌ లోని సర్వీస్‌ అపార్ట్ ‌మెంట్ ‌లో భాను కిరణ్‌, మధు, మన్మోహన్‌ ‌లు కలిసి ఉండేవారు. సూరి హైదరాబాద్‌ కు రాగానే ముగ్గురూ అతనుండే మాదాపూర్‌ అలేఖ్య రెసిడెన్సీకి వచ్చేవారు. రాత్రివరకూ సమాలోచనలు జరిపి తర్వాత ముగ్గురూ సర్వీస్‌ అపార్ట్ ‌మెంట్ ‌కు వెళ్లేవారు. సూరి అంగరక్షకులతో కలిసి ఉండేవాడు.

భాను కిరణ్ కోసం పోలీసులు పూణే, ముంబైల్లో అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇంతకు ముందు కోల్‌ కత్తా, బెంగళూర్, బీహార్‌ ల్లో అతని కోసం పోలీసులు అన్వేషించారు. తిరిగి పూణే, ముంబైలపై దృష్టి సారించారు. భాను కిరణ్ పారిపోయి వారం రోజులు గడుస్తున్నా పోలీసులు ఏ విధమైన పురోగతి సాధించలేదు. అయితే, భాను కిరణ్ సంబంధాలపై విస్తృతంగా ఆరాలు తీస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X