కెసిఆర్ మౌనం వ్యూహాత్మకమే, రాజీనామాలతో తెలంగాణ: హరీష్‌ రావు

Harish Rao
హైదరాబాద్: రాజీనామాలతోనే తెలంగాణ సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, సిద్దిపేట శాసనసభ్యుడు టి.హరీష్‌రావు మంగళవారం స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మా పార్టీ ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్నారు. అవసరమైతే రాజీనామాలకు కూడా సిద్ధమని ప్రకటించారు. వెనక్కి తగ్గేది లేదన్నారు. పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు మౌనం వ్యూహాత్మకమేనని స్పష్టం చేశారు. ఉద్యమం ఇంత జరుగుతున్నా కెసిఆర్ మాట్లాడటం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్న దృష్ట్యా ఆయన సమాధానం చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తారీఖున తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం ఉంటుందన్నారు. ఉద్యోగులు కూడా ఆ రోజు పెన్‌డౌన్ చేయాలని సూచించారు. తెలంగాణలో ఉద్యమం సజీవంగా ఉండటానికి కారణం టీఆర్ఎస్ నేతల రాజీనామాలే కారణమని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెసు నేతలు రాజీనామా చేస్తే తెలంగాణ ఖచ్చితంగా వస్తుందని చెప్పారు. రాజీనామాకు భయపడే వాళ్లే కెసిఆర్‌పై అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+